"సుగుణక్క" శాంతనమూర్తివి సహృదయానందలహరివిసమానత్వధోరణిని స్వభావములోనే ఇముడ్చుకున్న మాతృమూర్తివిసద్గుణాల సవ్వడిని గల్లు గల్లున మ్రోగించిన టేకుమళ్ళ పుత్రికవిసమాజ మార్పుకు, క్రీస్తు పరిచర్యకు సాక్షిగా నిలచిన నిజ సైనికురాలవు తనదైన శైలితో ప్రభువు కొరకు అహర్నిశలు పనిచేసిన త్యాగశీలివితామసము చేయక త్వరితగతిన క్రీస్తు తరంగాలనుతెరపైకి ఎక్కించిన వీర వనితవుతంబూరనాదముతో ప్రభుని పిలుపుతో గగనాలకు కొనిపోబడ్డ క్రీస్తు బిడ్డవు చిరునవ్వు నీ ఉనికిచెరగని దైర్యం నీ ఊపిరిచెప్పనశక్యము కానిది నీ ఓర్పుచెప్పనలవి కానిది నీ కూర్పుచేస్తుంది తప్పక ప్రజల హృదయములో నిజ మార్పు అక్కా నీవు చూపిన మాదిరిఅంతము వరకు వెదజల్లిన ఆ సుగుణాల పరిమళాల ఆవిరిఅనుదినము మా జీవితాలను ప్రభావితము చేస్తుంది. __శ్యామ్. చింతా*భీమునిపట్టణము (మస్కట్)