సాతాను, మీరు అవిశ్వాసిగానే మిగిలిపోవాలి అని చాలా కోరుకున్నాడు. అతను వదిలిపెట్టేవాడు కాదు. ఇప్పుడు అతను, దేవుని రాజ్యం యొక్క విస్తరణ ప్రయత్నాలలో మీరు ఫలించకూడదని కోరుకుంటాడు. ఇది, ఒకే జంటగా ఉన్న సత్యం యొక్క సూత్రాన్ని గట్టిగా పట్టుకోవడంలో, అసమతుల్యతను కలిగించడం ద్వారా కావచ్చు. మంచి ఉద్దేశంతోనే తొందరపడే విశ్వాసులను, మోసపూరితమైన మరియు జిత్తులమారి బోధకుల ద్వారా మోసగించి ఒకే మూలకు నడిపించడం ద్వారా కావచ్చు.
జంటగా ఉన్న సత్యం ఉండి, అవి లేఖనాలను అనుసరించి ఉన్నప్పుడు, రెంటినీ సమపాళ్ళలో అనుసరించాల్సి ఉంటుంది.
బయట ఉంచబడిన సత్యం మరియు లోపలికి రావాల్సిన అనుభవం:
మీరు ఒక వేదాంతవేత్తగా మరియు తత్వవేత్తగా, వెల్లడైన సత్యాన్ని రాబడుతూ, దేవుడు ఉద్దేశించిన గొప్ప అనుభవాన్ని కోల్పోవచ్చు
[లేదా]
మీరు పొందిన కొద్ది అనుభవాలతో ఆనందిస్తూ దేవుని గూర్చిన జ్ఞానం విషయములో ఆధ్యాత్మిక దారిద్ర్యములో ఉండవచ్చు.
దేవుని సార్వభౌమాధికారం మరియు మానవ బాధ్యత:
ఆయన చిత్తాన్ని ప్రశంసిస్తూ ఏ పనీ మీరు చేయకుండా ఉండిపోవచ్చు.
[లేదా]
ఆయన సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి బరువంతా మీరే మోస్తూ గొప్ప చెప్పుకుంటూ, నలిగిపోతూ,సణగుతూ ఉందిపోవచ్చు.
ముందే ఉన్న దేవుని నిర్ణయం మరియు మానవ స్వేచ్ఛ:
మీరు పరలోకానికి ఎలాగూ వెళ్తారని తెలిసి ఉత్సహిస్తూ సువార్త ఈ విషయంలో ఇతరుల యెడల జాలి లేకుండా ఉండవచ్చు .
[లేదా]
మీరు మీ స్వేచ్ఛను గొప్పచేసుకుంటూ, నైతికంగా ఉండటానికి కష్టపడుతూ ప్రతి దశలో ఆయన ఇచ్చే విమోచనను ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు మరియు మీ ఇష్టాన్ని చేయడంలో కొట్టుకుపోవచ్చు.
సంఖ్యా పరమైన పరిమాణం మరియు వ్యక్తి యొక్క నాణ్యత:
మీరు చాలా మందికి రక్షణ సువార్త అందించడంలో ఆనందిస్తూ వారి వ్యక్తిగత జీవితాలను పట్టించుకోకపోవచ్చు .
[లేదా]
కొంతమందిని మంచి శిష్యులుగా తయారు చేస్తున్నామని ఆనందిస్తూ ఎంతోమంది నశించిపోయే వారిని పట్టించుకోకుండా ఉండిపోవచ్చు.
వ్యక్తిగత విశ్వాసం మరియు సామూహిక విశ్వాసం:
మీరు మీ విశ్వాసంలో ఆనందిస్తూ సామూహికంగా వ్యక్తపరిచే విశ్వాసము యొక్క సిద్ధాంతపరమైన సూత్రాలను నిర్లక్ష్యం చేయవచ్చు.
[లేదా]
"విశ్వాసాన్ని" సంఘముగా వ్యక్తపరిచే విశ్వాస ప్రమాణాలతో సరిపెట్టుకుంటూ, ఆనందిస్తూ మీ వ్యక్తిగత విశ్వాస విషయాలను పట్టించుకోకపోవచ్చు.
సమృద్ధి మరియు లేమి:
మీరు అడగడం మరియు అనుభవించడంలో ఆనందిస్తూ మీ లేమి ద్వారా ఆయన చిత్తంలో ఏమి చూపిస్తాడో తెలుసుకోకపోవచ్చ.
[లేదా]
మీరు పేదరికాన్ని ఆచరిస్తూ దానిలో గర్వపడుతూ క్రైస్తవ సన్యాసులుగా ఉండిపోతూ ఆయన అనుగ్రహించే సదుపాయాలను తృణీకరించవచ్చు.
సువార్తీకరణ మరియు సామాజిక సేవ:
మీరు సువార్తను ప్రకటించడంలో ఆనందిస్తూ మీ చుట్టూ ఉన్న పేదలను పట్టించుకోకపోవచ్చు.
[లేదా]
మీరు సామాజిక సేవలో ఆనందిస్తూ సువార్త పనిని ఎప్పుడూ పట్టించుకోకపోవచ్చు.
ఆత్మ వరము మరియు ఆత్మ యొక్క ఫలము:
మీరు మీ వరము గురించి పూర్తిగా ఎరిగి పనిచేస్తూ, క్రీస్తు పోలిక అని చెప్పబడే ఆత్మ ఫలము విషయములో ఆలోచన లేకుండా ఉండవచ్చు.
[లేదా]
మీరు మీ స్వభావ శీలములో ఆనందిస్తూ వరాన్ని బట్టి పని కలిగి ఉండటం మీద దృష్టిని సారించకపోవవచ్చు.
దేవుడిచ్చు సర్వాంగ కవచము:
దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ప్రతి భాగము, అనగా సత్యం అనే నడికట్టు, నీతి అనే మైమరువు, సువార్త సిద్ధపాటు అనే పాదరక్షలు , విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం మరియు వాక్యము అనే ఖడ్గము, అనేవన్నియు సమాన అవసరతలే.
ఏ ఒక్క భాగము తప్పిపోయినా మీరు శత్రువు దాడికి తావిస్తారు.
ఈ రోజుల్లో అనేకమంది బోధకులు ఒక్క భాగము గురించి నొక్కి చెప్పటంలో ఆనందిస్తూ మిగిలిన ఐదింటికీ గుర్తింపు లేకుండా చేస్తున్నారు . ఇది వారు తమ ఆధ్యాత్మిక తీవ్రతగా గుర్తింపు ఆశిస్తూ చలామణి అవుతారు.అది శత్రువుతో మన యుద్ధంలో, ప్రాణాంతక నష్టాన్ని కలిగిస్తుంది. మనం మెలకువగానూ జాగ్రత్తగానూ ఉందాము. ప్రార్థన మాత్రమే వీటన్నిటినీ కలిపి ఉంచుతుంది.
హితబోధను గట్టిగా పట్టుకొని, సమతుల్యతను పాటించడంలో ప్రభువు మనకు సహాయము చేయును గాక.